1

1 [This verse may not be a part of this translation]

2 [This verse may not be a part of this translation]

3 [This verse may not be a part of this translation]

4 నోవహు , షేము, హాము, యాపెతు.

5 యాపెతు కుమారులెవరనగా: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు మరియు తీరసు.

6 అష్కనజు, రీఫతు, తోగర్మాలనేవారు గోమెరు కుమారులు.

7 ఎలీషా, తర్షీషు, కిత్తీము, రోదానీము అనేవారు యావాను కుమారులు.

8 కూషు, (ఇథియోపియ) మిస్రాయిము, (ఈజిప్టు) పూతు మరియు కనాను అనేవారు హాము కుమారులు.

9 సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా అనేవారు కూషు కుమారులు. షెబ, దదాను అనేవారు రాయమా కుమారులు.

10 నిమ్రోదు అనువాడు కూషు సంతతివాడు. నిమ్రోదు ప్రపంచంలోనే మహా ధైర్యవంతుడు, బలవంతుడైన సైనికుడయ్యాడు.

11 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు వీరందరికి మిస్రాయిము (ఈజిప్టు) వంశకర్త.

12 అంతేకాదు, పత్రుసీయులకు, కస్లూహీయులకు మరియు కఫ్తోరీయులకు కూడ మిస్రాయిము వంశకర్త. ఫిలిష్తీయులు (పాలస్తీను ప్రజలు) కస్లూహునుండి వచ్చినవారు.

13 కనాను పెద్ద కుమారుని పేరు సీదోను, రెండవ కుమారుడు హేతు. మరియు హిత్తీయులకు

14 యెబూసీయులకు, అమోరీయులకు, గిర్గాషీయులకు,

15 హివ్వీయులకు, అర్కీయులకు, సీనీయులకు,

16 అర్వాదీయులకు, సెమారీయులకు మరియు హమాతీయులకు కూడ కనాను వంశకర్త.

17 షేము కుమారులు ఎవరనగా: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు మరియు అరాము. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు మరియు మెషెకు .

18 అర్పక్షదుకు షేలహు అను కుమారుడు పుట్టాడు. షేలహునకు ఏబెరు అనువాడు పుట్టాడు.

19 ఏబెరుకు ఇద్దరు కుమారులు. ఒకని పేరు పెలెగు . అతని కాలంలో ప్రపంచ జనాభా వివిధ భాషా వర్గాలుగా విడిపోయిన కారణంగా అతనికి పెలెగు అని పేరు పెట్టారు. పెలెగు సోదరుని పేరు యొక్తాను. (

20 అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

21 హదోరము, ఊజాలు, దిక్లాను,

22 ఏబాలు, అబీమాయేలు, షేబ,

23 ఓఫీరు, హవీలా మరియు యోబాబు. వీరంతా యొక్తాను కుమారులు.)

24 అబ్రాహాము సంతానం ఎవరనగా: షేము, అర్పక్షదు, షేలహు,

25 ఏబెరు, పెలెగు, రయూ,

26 సెరూగు, నాహోరు, తెరహు,

27 మరియు అబ్రాహాము పేరుతో పిలవబడిన అబ్రాము.

28 అబ్రాహామునకు ఇస్సాకు, ఇష్మాయేలు అను ఇరువురు కుమారులు.

29 ఇష్మాయేలు సంతానం ఎవరనగా: ఇష్మాయేలు ప్రథమ పుత్రుడు నెబాయోతు. ఇష్మాయేలు ఇతర కుమారులెవరనగా కేదారు, అద్బయేలు, మిబ్శాము,

30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా,

31 యెతూరు, నాపీషు, కెదెమా అనువారు. వీరంతా ఇష్మాయేలు కుమారులు.

32 కెతూరా అబ్రాహాముకు దాసి . ఆమెకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు మరియు షూవహు అను కుమారులు కలిగారు. యొక్షానుకు షేబ, దదాను అను కుమారులు పుట్టారు.

33 ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు.

34 ఇస్సాకు తండ్రి పేరు అబ్రాహాము. ఇస్సాకు కుమారుల పేర్లు ఏశావు, ఇశ్రాయేలు .

35 ఎలీఫజు, రెయూవేలు, యెయూషు, యలాము మరియు కోరహు అనేవారు ఏశావు కుమారులు.

36 తేమాను, ఓమారు, సెపో , గాతాము, కనజు, తిమ్నా మరియు అమాలేకు అనేవారు ఎలీఫజు కుమారులు.

37 నహతు, జెరహు, షమ్మా మరియు మిజ్జ అనువారు రెయూవేలు కుమారులు.

38 లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు మరియు దిషోను అనువారంతా శేయీరు కుమారులు.

39 హోరీ, హోమాను ఇరువురూ లోతాను కుమారులు. తిమ్నా అనే యువతి లోతాను సోదరి.

40 అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము అనువారు శోబాలు కుమారులు. అయ్యా, అనా అను వారిరువురూ సిబ్యోను కుమారులు.

41 అనా కుమారుని పేరు దిషోను. అమ్రాము, ఎష్బాను, ఇత్రాను, కెరాను అనువారు దిషోను కుమారులు.

42 బిల్హాను, జవాను, యహకాను అనువారు ఏసెరు కుమారులు. ఊజు, అరానులిరువురూ దిషాను కుమారులు.

43 ఎదోము రాజుల పేర్లు ఈ విధంగా ఉన్నాయి: ఇశ్రాయేలులో రాజరిక వ్యవస్థ ఏర్పడటానికి చాలాకాలం క్రిందటనే ఏదోములో రాజులు పాలించారు. వీరు ఎవరనగా బెయారు కుమారుడైన బెల, అతని నగరం పేరు దిన్హాబా.

44 బెల చనిపోయిన పిమ్మట అతని స్థానంలో యోబాబు రాజయ్యాడు. యోబాబు తండ్రి పేరు జెరహు. యోబాబు బొస్రా నగరానికి చెందినవాడు.

45 యోబాబు చనిపోయిన తరువాత హుషాము అతని స్థానంలో రాజయ్యాడు. హుషాము తేమానీయుల దేశపువాడు.

46 హుషాము చనిపోయిన పిమ్మట హదదు రాజయ్యాడు. హదదు తండ్రి పేరు బెదెదు. మోయాబు దేశంలో మిద్యానీయులను హదదు ఓడించాడు. హదదు అవీతు నగరంవాడు.

47 హదదు చనిపోగా శమ్లా రాజయ్యాడు. ఇతడు మశ్రేకా నగరవాసి.

48 శమ్లా చనిపోయిన పిమ్మట షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. షావూలు యూఫ్రటీసు నదీ తీరానగల రహెబోతు పట్టణపు వాడు.

49 షావూలు మరణానంతరం బయల్ - హానాను రాజయ్యాడు. బయల్ - హానాను తండ్రి పేరు అక్బోరు.

50 బయల్ - హానాను చనిపోగా హదదు అతని స్థానంలో రాజయ్యాడు. హదదు నగరం పేరు పాయు . హదదు భార్య పేరు మెహేతబేలు. ఈమె తల్లి పేరు మత్రేదు. మత్రేదు మేజాహాబు కుమార్తె.

51 కొంత కాలానికి హదదు చనిపోయాడు. అప్పట్లో ఎదోము రాజ్యంలో తిమ్నా, అల్వాయతేతు,

52 అహలీబామా, ఏలా, పీనోను,

53 కనజు, తేమాను, మిబ్సారు,

54 మగ్దీయేలు మరియు ఈరాము నాయకులుగా ఉన్నారు. వీరంతా ఎదోము దేశ నాయకులు.

2

1 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను,

2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు.

3 ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ . ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు.

4 యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు . ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు.

5 పెరెసు కుమారులు హెస్రోను, హామూలు.

6 జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద.

7 జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను . ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు.

8 ఏతాను కుమారుడు అజర్యా.

9 హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై .

10 రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు .

11 నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు.

12 బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి.

13 యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ).

14 నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి.

15 యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు.

16 సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు.

17 అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు.

18 హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు.

19 అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు.

20 ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు.

21 పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను.

22 సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి.

23 కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి.

24 హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ.

25 యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము.

26 యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి.

27 యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు.

28 షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు.

29 అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు.

30 సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు.

31 అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి.

32 షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు.

33 పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా.

34 షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా.

35 షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి.

36 అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు.

37 జాబాదు కుమారుడు ఎఎ్లాలు. ఎఎ్లాలు కుమారుడు ఓబేదు.

38 ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా.

39 అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా.

40 ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము.

41 షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా.

42 యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను.

43 హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు.

44 షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.

45 షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు.

46 కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు.

47 యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు.

48 మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు.

49 మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా.

50 ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము.

51 తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు.

52 శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు . శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం:

53 మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు.

54 శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, 55మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ - రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.

55 [This verse may not be a part of this translation]

3

1 హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా: దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ, రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.

2 మూడవ కుమారుడు అబ్షాలోము. తల్మయి కుమార్తెయగు మయకా అతని తల్లి. తల్మయి గెషూరుకు రాజు. నాల్గవ కుమారుని పేరు అదోనీయా. అతని తల్లి పేరు హగ్గీతు.

3 ఐదవ కుమారుడు షెఫట్య. అతని తల్లి పేరు అబీటలు. ఆరవవాడు ఇత్రెయాము. ఇతని తల్లి దావీదు భార్య ఎగ్లా.

4 దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు. దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.

5 దావీదుకు యెరూషలేములో పుట్టిన సంతానమెవరనగా: బత్షెబకు నలుగురు సంతానం. వారు షిమ్యా, షోబాబు, నాతాను మరియు సొలొమోను. బత్షెబ అమ్మీయేలు కుమార్తె.

6 [This verse may not be a part of this translation]

7 [This verse may not be a part of this translation]

8 [This verse may not be a part of this translation]

9 వారంతా దావీదు కుమారులు. దావీదుకు ఇంకా దాసీ వలన కూడ కుమారులు కలిగారు. తామారు దావీదు కుమార్తె.

10 సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబీయా. అబీయా కుమారుడు ఆసా. ఆసా కుమారుడు యెహోషాపాతు.

11 యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు.

12 యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోతాము.

13 యోతాము కుమారుడు ఆహాజు. ఆహాజు కుమారుడు హిజ్కియా. హిజ్కియా కుమారుడు మనష్షే.

14 మనష్షే కుమారుడు ఆమోను. ఆమోను కుమారుడు యోషీయా.

15 యోషీయా కుమారులెవరనగా: యోహానాను మొదటి కుమారుడు. రెండవవాడు యెహోయాకీము. మూడవ కుమారుడు సిద్కియా. నాల్గవవాడు షల్లూము.

16 యెహోయాకీము సంతానంలో యెకొన్యా, అతని కుమారుడు: సిద్కియా, అతని కుమారుడు వున్నారు .

17 యెహోయాకీను బబలోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు,

18 మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యెకమ్యా, హోషామా మరియు నెదబ్యా.

19 పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమీ. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలోమీతు మరియు వారి సహోదరి.

20 జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు.

21 హనన్యా కుమారులు పెలట్యా, యెషయా, రెఫయా, అర్నాను, ఓబద్యా మరియు షెకన్యా .

22 షెకన్యా సంతతిలో షెమయా ఒకడు. షెమయాకు ఆరుగురు కుమారులు: వారు షెమయా, హట్టూషు, ఇగాలు బారియహు, నెయర్యా, షాపాతు.

23 నెయర్యాకు ముగ్గురు కుమారులు: వారు ఎల్యోయేనై, హిజ్కియా, అజీక్రాము.

24 ఎల్యోయేనై కుమారులు ఏడుగురు: వారు హోదవయా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా మరియు అనాని.

4

1 యూదా కుమారులు ఎవరనగా: పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.

2 శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా

3 అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.

4 పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా: హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.

5 తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు.

6 నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు.

7 హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు.

8 కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు.

9 యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది.

10 యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.

11 కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను.

12 ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు . వారంతా రేకా నుండి వచ్చిన వారు.

13 కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకుహతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు.

14 మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా. శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

15 యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.

16 యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.

17 [This verse may not be a part of this translation]

18 [This verse may not be a part of this translation]

19 మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క ఈ భార్య యూదాకు చెందిన స్త్రీ . మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా. ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు.

20 షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను. ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.

21 [This verse may not be a part of this translation]

22 [This verse may not be a part of this translation]

23 షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.

24 షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు.

25 షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.

26 మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ.

27 షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.

28 షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను,

29 బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను,

30 బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను,

31 బేత్మర్కా బేతులోను, హజర్షూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు.

32 ఆ పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను.

33 అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ఈ ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.

34 [This verse may not be a part of this translation]

35 [This verse may not be a part of this translation]

36 [This verse may not be a part of this translation]

37 [This verse may not be a part of this translation]

38 [This verse may not be a part of this translation]

39 వారు గెదోరుకు, ఆ పైభూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ఆ ప్రాంతాల వరకు సంచరించారు.

40 పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు.

41 యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. ఆ మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత ఈ మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు.

42 ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు.

43 అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు.

5

1 [This verse may not be a part of this translation]

2 [This verse may not be a part of this translation]

3 [This verse may not be a part of this translation]

4 యోవేలు సంతతి ఈ విధంగా వుంది: షెమయా అనేవాడు యోవేలు కుమారుడు. షెమయా కుమారుడు గోగు. గోగు కుమారుడు షిమీ.

5 షిమీ కుమారుడు మీకా. మీకా కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు బేలు.

6 బేలు కుమారుడు బెయేర. అష్షూరు (అస్సీరియా) రాజైన తిగ్లత్పిలేసెరు బెయేరను ఇల్లు వెడలగొట్టాడు. దానితో బెయేర అష్షూరు రాజుకు బందీ అయ్యాడు. రూబేను వంశానికి బెయేర పెద్ద.

7 యోవేలు సోదరుల పేర్లు, అతని వంశావళి వారి వంశ చరిత్రలో పొందుపర్చబడినట్లే క్రమ పద్ధతిలో సరిగ్గా వ్రాయబడినాయి. అవి ఏవనగా: యెహీయేలు మొదటివాడు. తరువాత జెకర్యా మరియు

8 బెల. బెల తండ్రి పేరు ఆజాజు. ఆజాజు తండ్రి షెమ. షెమ తండ్రి పేరు యోవేలు. వారంతా అరోయేరు నుండి నెబో వరకు, బయల్మెయోను వరకు గల ప్రాంతంలో నివసించారు.

9 బెల వంశీయులు తూర్పు దిశన యూఫ్రటీసు నది ఒడ్డున అడవి అంచువరకుగల ప్రాంతంలో నివసించారు. గిలాదులో వారికి లెక్కలేనన్ని ఆవుల మందలు వున్నందున వారక్కడ నివసించసాగారు.

10 సౌలు రాజుగా ఉన్న కాలంలో బెల వంశీయులు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. తరువాత వారు హగ్రీయులకు చెందిన గుడారాలను ఆక్రమించి వాటిలో నివసించారు. గిలాదుకు తూర్పు ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయుల గుడారాలలో వారునివసించసాగారు.

11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు.

12 బాషానులో యోవేలు మొదటి నాయకుడు (పెద్ద). షాపాము రెండవ నాయకుడు. పిమ్మట యహనైషాపాత్ ముఖ్యుడయ్యాడు.

13 వారి కుటుంబాలలో ఏడుగురు అన్నదమ్ములు. వారు మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ మరియు ఏబెరు.

14 వీరు అబీహాయిలు సంతతివారు. అబీహాయిలు అనేవాడు హూరీ కుమారుడు. హూరీ తండ్రి పేరు యారోయ. యారోయ తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి యెషీషై, యెషీషై తండ్రి యహదో. యహదో తండ్రి బూజు.

15 అహీ అనువాడు అబ్దీయేలు కుమారుడు. అబ్దీయేలు తండ్రి పేరు గూనీ. అహీ వారి వంశ పెద్ద.

16 గాదీయులు గిలాదు ప్రాంతంలో నివసించారు. వారు బాషానులోను, దాని చుట్టుపట్ల గ్రామాలలోను, షారోను సరిహద్దు వరకు గల పొలాలలోను కూడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

17 యోతాము, యరోబాముల కాలంలో ఈ ప్రజల పేర్లన్నీ గాదు వంశ చరిత్రలో వ్రాయబడినాయి. యోతాము యూదాకు రాజు. యరోబాము ఇశ్రాయేలు రాజు.

18 మనష్షే వంశంలో సగం మందిలోను, రూబేను, గాదు వంశాలలోను మొత్తం నలుబది నాలుగువేల ఏడు వందల అరవై మంది యుద్ధ వీరులున్నారు. వారు డాళ్లను, కత్తులను చేపట్టగలవారు. వారు బాణవిద్యలో నేర్పరులు. చాకచక్యంతో యుద్ధం చేయగలవారు.

19 వారు హగ్రీయులతోను, యేతూరు, నాపీషు, నోదాబు వారితోను యుద్ధం చేశారు.

20 మనష్షే వంశం వారు, రూబేను, గాదు వంశాల ప్రజలు యుద్ధంలో దేవుని సహాయం అర్థించి ప్రార్థన చేశారు. వారు దేవునియందు విశ్వాసమున్న వారు గనుక తమకు సహాయపడమని దేవుని అర్థించారు. కావున దేవుడు వారి ప్రార్థన ఆలకించి సహాయపడ్డాడు. హగ్రీయులను యుద్ధంలో ఓడించటానికి దేవుడు వారికి సహాయం చేసాడు. హగ్రీయులతో వున్న ఇతరులను కూడ వారు ఓడించారు.

21 హగ్రీయులకు చెందిన పశు సంపదనంతా వారు వశపర్చుకున్నారు. వారు ఏబై వేల ఒంటెలను, రెండు లక్షల ఏబైవేల గొర్రెలను, రెండువేల గాడిదలను, మరియు ఒక లక్ష మంది మనుష్యులను పట్టుకున్నారు.

22 యద్ధంలో రూబేనీయులకు దేవుని సహాయం ఉన్న కారణంగా హగ్రీయులలో చాలామంది చనిపోయారు. అప్పుడు మనష్షే, రూబేను, గాదు వంశీయులు హగ్రీయుల రాజ్యంలో నివసించసాగారు. వారక్కడ బబులోను (బాబిలోనియా) సైన్యం ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా బబలోనుకు పట్టుకుపోయే సమయం వరకు నివసించారు.

23 మనష్షే వంశం వారిలో సగంమంది బాషాను ప్రాంతంలో బెల్‌హెర్మోను వరకు, శెనీరు, హెర్మోను పర్వతం వరకు నివసించారు. వారి ప్రజలు అధిక సంఖ్యలో విస్తరించారు.

24 మనష్షే కుటుంబంలో ఒక సగంమంది కుటుంబ పెద్దలు ఎవరనగా ఏషెరు, ఇషీ, ఎలీయేలు, అజీ్రయేలు, యిర్మీయా, హోదవ్యా మరియు యహదీయేలు. వీరంతా బలపరాక్రమ సంపన్నులు, ప్రసిద్ధి గాంచిన వ్యక్తులు. వారి వారి కుటుంబాలకు వారు పెద్దలు.

25 కాని, వారి పూర్వీకులు ఆరాధించిన దేవుని పట్ల వారు పాపం చేశారు. వారు స్థిరపడినచోట వున్న విగ్రహాలనే వారు ఆరాధించటం మొదలు పెట్టారు. అటువంటి వాళ్లను దేవుడు నాశనము చేసియుండెను.

26 ఇశ్రాయేలు దేవుడు పూలును యుద్ధానికి పురిగొల్పాడు. పూలు అష్షూరు (అస్సీరియా) రాజు. అతనినే తిగ్లత్పిలేసెరు అని కూడ పిలుస్తారు. అతడు మనష్షే, రూబేను, గాదు వంశీయులతో యుద్ధం చేసాడు. వారిని తమ ఇండ్లు వదిలి వేసేలా బలవంతం చేసి బందీలుగా పట్టుకున్నాడు. తరువాత వారిని హాలహు, హాబోరు, హారా పట్టణాలకు, గోజాను నదీ తీరానికి తీసుకొని వెళ్లాడు. అప్పటినుండి ఈనాటికీ ఆ ఇశ్రాయేలీయుల కుటుంబాల వారు అక్కడ నివసిస్తున్నారు.

6

1 గెర్షోను, కహాతు, మెరారి అనేవారు లేవీ కుమారులు.

2 కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

3 అమ్రాముకు అహరోను, మోషే అనే ఇరువురు కుమారులు, మిర్యాము అనే కుమార్తె ఉన్నారు. అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనేవారు కుమారులు.

4 ఎలియాజరు అనువాడు ఫీనెహాసుకు తండ్రి. ఫీనెహాసు కుమారుడు అబీషువ.

5 అబీషువ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ.

6 ఉజ్జీ కుమారుడు జెరహ్యా. జెరహ్యా కుమారుడు మెరాయోతు.

7 మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.

8 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు.

9 అహిమయస్సు కుమారుడు అజర్యా. అజర్యా కుమారుడు యోహానాను.

10 యోహానాను కుమారుడు అజర్యా. (యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయంలో యాజకునిగా పనిచేసిన వ్యక్తే ఈ అజర్యా).

11 అజర్యా కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.

12 అహీటూబు కుమారడు సాదోకు. సాదోకు కుమారుడు షల్లూము.

13 షల్లూము కుమారుడు హిల్కీయా. హిల్కీయా కుమారుడు అజర్యా.

14 అజర్యా కుమారుడు శెరాయా. శెరాయా కుమారుడు యెహోజాదాకు.

15 యెహోవా యూదా వారిని, యెరూషలేము వారిని బయటకు పంపివేసినప్పుడు యెహోజాదాకు కూడ గత్యంతరం లేక వారితో ఇల్లు వదలి పోవలసి వచ్చింది. ఆ ప్రజలు ఒక కొత్త రాజ్యంలో బందీలయ్యారు. యూదా వారిని, యెరూషలేము వారిని బందీలు చేయటానికి యెహోవా నెబకద్నెజరును వినియోగించాడు.

16 లేవీ కుమారులు గెర్షోను, కహాతు, మెరారి అనేవారు.

17 గెర్షోను కుమారులు లిబ్నీ మరియు షిమీ.

18 కహాతుకుమారులు అమ్రాము, ఇస్హారు, మెబ్రోను మరియు ఉజ్జీయేలు.

19 మెరారి కుమారులు మహలి, మూషి. లేవి వంశంలోగల కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయి. మొదట వారి తండ్రి పేరుతో జాబితా వ్రాయబడింది.

20 గెర్షోను సంతతివారు గెర్షోను కుమారుడు లిబ్నీ. లిబ్నీ కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా.

21 జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు యెయతిరయి.

22 కహతు సంతతి వారు ఎవరనగా కహతు కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు కోరహు. కోరహు కుమారుడు అస్సీరు.

23 అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు.

24 అస్సీరు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఊరియేలు. ఊరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు.

25 ఎల్కానా కుమారులు అమాశై, అహీమోతు.

26 ఎల్కానా మరో కుమారుడు జోఫై . జోఫై కుమారుడు నహతు.

27 నహతు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు సమూయేలు.

28 సమూయేలు కుమారులలో పెద్దవాడు యోవేలు. రెండవవాడు అబీయా.

29 మెరారి సంతానం వివరాలు ఏవనగా: మెరారి కుమారుడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమీ. షిమీ కుమారుడు ఉజ్జా.

30 ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గీయా, హగ్గీయా కుమారుడు అశాయా.

31 యెహోవా ఒడంబడిక పెట్టె ఆలయంలో ఉంచిన తరువాత దావీదు కొందరు సంగీత విద్వాంసులను నియమించాడు.

32 వీరు పవిత్ర గుడారంలో దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే సమావేశ గుడారమని పిలవబడేది. సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఆలయాన్ని నిర్మించేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని చేసారు.

33 సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల పేర్ల వివరాలు ఇలా వున్నాయి: కహతీయుల సంతతి వారు: హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు.

34 సమూయేలు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యెరోహాము. యెరోహాము తండ్రి ఏలీయేలు. ఏలీయేలు తండ్రి తోయహు.

35 తోయహు తండ్రి సూపు. సూపు తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి మహతు. మహతు తండ్రి అమాశై.

36 అమాశై తండ్రి ఎల్కానా. ఎల్కానా తండ్రి యోవేలు. యోవేలు తండ్రి అజర్యా. అజర్యా తండ్రి జెఫన్యా.

37 జెఫన్యా తండ్రి తాహతు. తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు.

38 కోరహు తండ్రి ఇస్హారు. ఇస్హారు తండ్రి కహాతు. కహాతు తండ్రి లేవి. లేవి తండ్రి ఇశ్రాయేలు.

39 హేమాను బంధువు ఆసాపు. హేమాను ఆసాపు కుడి పక్కన నిలబడేవాడు. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. బెరక్యా తండ్రి షిమ్యా.

40 షిమ్యా తండ్రి మిఖాయేలు. మిఖాయేలు తండ్రి బయశేయా. బయశేయా తండ్రి మల్కీయా.

41 మల్కీయా తండ్రి యెత్నీ. యెత్నీ తండ్రి జెరహు. జెరహు తండ్రి అదాయా.

42 అదాయా తండ్రి ఏతాను. ఏతాను తండ్రి జిమ్మా. జిమ్మా తండ్రి షిమీ.

43 షిమీ తండ్రి యహతు. యహతు తండ్రి గెర్షోను. గెర్షోను తండ్రి లేవి.

44 మెరారి సంతతి వారు హేమానుకు, ఆసాపుకు బంధువులు. వారు హేమానుకు ఎడమ పక్కన నిలబడి స్తోత్రగీతాలు పాడేవారు. ఏతాను తండ్రి పేరు కీషీ. కీషీ తండ్రి అబ్దీ. అబ్దీ తండ్రి మల్లూకు.

45 మల్లూకు తండ్రి హషబ్యా. హషబ్యా తండ్రి అమజ్యా. అమజ్యా తండ్రి హిల్కీయా.

46 హిల్కీయా తండ్రి అమ్జీ. అమ్జీ తండ్రి బానీ. బానీ తండ్రి షమెరు.

47 షమెరు తండ్రి మహలి. మహలి తండ్రి మూషి. మూషి తండ్రి మెరారి. మెరారి తండ్రి లేవి.

48 హేమాను, ఆసాపుల సోదరులు లేవి వంశంలోని వారే. లేవి సంతతినంతా లేవీయులని పిలుస్తారు. లేవీయులు యెహోవా పవిత్ర గుడారంలో సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వారు. పవిత్ర గుడారమనగా దేవుని ఇల్లు.

49 కాని అహరోను, అతని సంతతి వారు మాత్రమే బలిపీఠంపై దహనబలులు అర్పించేందుకు అనుమతించబడ్డారు. వారికి ధూపపీఠం మీద ధూపంవేసే హక్కు కూడ వుంది. ఆలయపు అతిపరిశుద్ధ స్థలంలోని పనంతా వారే చేసేవారు. ఇశ్రాయేలు పాపపరిహారార్థం, ప్రజల పాపాలకు విచార సూచకంగా వారు ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యాలు నిర్వహించేవారు. మోషే నిర్దేశించిన నియమాలను, నిబంధనలను వారు తప్పక పాటించేవారు. మోషే దేవుని సేవకుడు.

50 అహరోను కుమారులు ఎవరనగా: అహరోను కుమారుడు ఎలియాజరు. ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు. ఫీనెహాసు కుమారుడు అబీషూవ.

51 అబీషూవ కుమారుడు బుక్కీ. బుక్కీ కుమారుడు ఉజ్జీ. ఉజ్జీ కుమారుడు జెరహ్య.

52 జెరహ్య కుమారుడు మెరాయోతు. మెరాయోతు కుమారుడు అమర్యా. అమర్యా కుమారుడు అహీటూబు.

53 అహీటూబు కుమారుడు సాదోకు. సాదోకు కుమారుడు అహిమయస్సు.

54 అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది.

55 వారికి హెబ్రోను పట్టణం, దాని చుట్టు పక్కల భూములు ఇవ్వబడ్డాయి. ఇది యూదా దేశంలో వుంది.

56 కాని పట్టణానికి దూరంగావున్న భూములు, హెబ్రోను పట్టణానికి దగ్గరలో వున్న గ్రామాలు కాలేబుకు ఇవ్వబడ్డాయి. కాలేబు తండ్రి పేరు యెపున్నె.

57 అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో,

58 హీలేను, దెబీరు,

59 ఆషాను, యుట్ట, బేత్షెమెషు నగరాలు కూడ ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు వాటి సమీపంలోని పచ్చిక బయళ్ళు కూడ వారికియ్యబడ్డాయి.

60 బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి.

61 కహాతు సంతతి వారైన వంశాల వారికి మనష్షే వంశం వారి సగంమందికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి.

62 గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి.

63 మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు.

64 ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాలను, పొలాలను లేవీయులకు ఇచ్చారు.

65 పైన పేర్కొనబడిన ఆ నగరాలన్నీ చీట్లువేసి యూదా, షిమ్యోను, బెన్యామీను కుటుంబాల వారినుండి తీసుకొనబడి వారికియ్యబడ్డాయి.

66 ఎఫ్రాయిము వంశం వారు కూడ కొందరు కహాతీయుల కుటుంబాల వారికి కొన్ని పట్టణాలను ఇచ్చారు. ఈ పట్టణాలను కూడ చీట్లువేసి ఇచ్చారు.

67 వారికి షెకెము నగరం ఇవ్వబడింది. షెకెము కూడ ఒక రక్షణ (ఆశ్రయ) నగరం. వారికి ఇంకను గెజెరు,

68 యొక్మెయాము, బేత్‌హోరోను,

69 అయ్యాలోను, మరియు గత్రిమ్మోను పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలతో పాటు వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలు ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో వున్నాయి.

70 సగం మనష్షే గోత్రం వారి నుండి ఆనేరు, బిలియాము పట్టణాలను ఇశ్రాయేలు వారు తీసుకొని కహాతీయులకు ఇచ్చారు. పట్టణాలతో పాటు కహాతీయులకు పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.

71 గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

72 [This verse may not be a part of this translation]

73 [This verse may not be a part of this translation]

74 [This verse may not be a part of this translation]

75 [This verse may not be a part of this translation]

76 గెర్షోను వారు నఫ్తాలి వంశం నుండి గలిలయలోని కెదెషు, హమ్మోను మరియు కిర్యతాయిము పట్టణాలను పొందారు. ఆ పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

77 మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి.

78 [This verse may not be a part of this translation]

79 [This verse may not be a part of this translation]

80 [This verse may not be a part of this translation]

81 [This verse may not be a part of this translation]

7

1 ఇశ్శాఖారుకు నలుగురు కుమారులు. తోలా, పువ్వా, యాషూబు, షిమ్రోను అని వారి పేర్లు.

2 తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.

3 ఉజ్జా కుమారుడు ఇజ్రహయా. ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, ఓబద్యా, యోవేలు, ఇష్షీయా అనేవారు. వీరైదుగురు కుటుంబ పెద్దలు.

4 వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

5 ఇశ్శాఖారు వంశంలో ఎనభై ఏడువేల మంది బలిష్టులైన సైనికులున్నట్లు వారి వంశ చరిత్ర తెలియజేస్తుంది.

6 బెన్యామీనుకు ముగ్గురు కుమారులు. బెల, బేకరు, యెదీయవేలు అని వారి పేర్లు.

7 బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.

8 బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయేజెరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోత, అబీయా, అనాతోతు, ఆలెమెతు అనేవారు. ఇది బేకరు సంతానం.

9 వీరి వంశ చరిత్ర వారి పెద్దలను విశదపరుస్తుంది. వారిలో ఇరవైవేల రెండు వందల మంది సైనికులున్నట్లు వారి చరిత్ర తెలియజేస్తుంది.

10 యెదీయవేలు కుమారుడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయానా, జేతాను, తర్షీషు, అహీషహరు అనువారు.

11 యెదీయవేలు కుమారులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారిలో పదిహేడువేల రెండువందల మంది యుద్ధవీరులున్నారు.

12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము.

13 నఫ్తాలి కుమారులు యహసయేలు, గూనీ, యేసెరు, షిల్లేము అనేవారు. వీరందరూ బిల్హా సంతతిగా ఎంచబడిరి.

14 మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు.

15 హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకుసెలో పెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే.

16 మాకీరు భార్య మయకా ఒక కుమారుని కన్నది. మయకా ఈ కుమారునికి పెరెషు అని పేరు పెట్టింది. పెరెషు సోదరుని పేరు షెరెషు. షెరెషు కుమారుల పేర్లు ఊలాము, రాకెము.

17 ఊలాము కుమారుని పేరు బెదాను. గిలాదు సంతతి వారెవరనగా: గిలాదు తండ్రి పేరు మాకీరు. మాకీరు తండ్రి పేరు మనష్షే.

18 మాకీరు సోదరియగు హమ్మోలెకెతునకు ఇషోదు, అబీయెజెరు, మహలా అనేవారు జన్మించారు.

19 షెమీదా కుమారుల పేర్లు అహోయాను, షెకెము, లికీ, అనీయాము.

20 ఎఫ్రాయిము సంతతివారి పేర్లు ఏవనగా: ఎఫ్రాయిము కుమారుని పేరు షూతలహు. షూతలహు కుమారుడు బెరెదు. బెరెదు కుమారుడు తాహతు. తాహతు కుమారుడు ఎలాదా.

21 ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు. గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు.

22 ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు.

23 పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది.

24 ఎఫ్రాయిము కుమార్తె పేరు షెయెరా. షెయెరా దిగువ బేత్‌హోరోను, ఎగువ బేత్‌హోరోను, దిగువ ఉజ్జెన్‌షెయెరా, ఎగువ ఉజ్జెన్‌షెయెరా అనే పట్టణాలను కట్టించింది.

25 ఎఫ్రాయిము కుమారుని పేరు రెపహు. రెపహు కుమారుని పేరు రెషెపు. రెషెపు కుమారుడు తెలహు. తెలహు కుమారుడు తహను.

26 తహను కుమారుడు లద్దాను. లద్దాను కుమారుడు అమీహూదు. అమీహూదు కుమారుడు ఎలీషామా.

27 ఎలీషామా కుమారుడు నూను. నూను కుమారుడు యెహోషువ.

28 ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు.

29 మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.

30 ఆషేరు కుమారులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బేరీయా అనువారు. వారి సోదరి పేరు శెరహు.

31 బెరీయా కుమారులు హెబెరు మరియు మల్కీయేలు. మల్కీయేలు కుమారుడు బిర్జాయీతు.

32 హెబెరు కుమారులు యప్లేటు, షోమేరు, హోతాము అనువారు. షూయా వారి సహోదరి.

33 యప్లేటు కుమారులు పాసకు, బింహాలు, అష్వాతు అనేవారు. వీరంతా యప్లేటు సంతానం.

34 షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బా, అరాము.

35 షోమేరు సోదరుని పేరు హేలెము. హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు.

36 జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరీ, ఇమ్రా,

37 బేసెరు, హాదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేర.

38 ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా.

39 ఉల్లాము కుమారులు ఆరహు, హన్నియేలు, రిజెయా.

40 వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.

8

1 బెన్యామీను పెద్ద కుమారుని పేరు బెల. బెన్యామీను రెండవ కుమారుని పేరు అష్బేలు. అతని మూడవ కుమారుడు అహరహు.

2 బెన్యామీను నాల్గవ కుమారుడు నోహా. అయిదవవాడు రాపా.

3 [This verse may not be a part of this translation]

4 [This verse may not be a part of this translation]

5 [This verse may not be a part of this translation]

6 [This verse may not be a part of this translation]

7 [This verse may not be a part of this translation]

8 మోయాబు దేశంలో షహరయీము తన భార్యలగు హూషీము, బయరాలకు విడాకులిచ్చాడు. ఇది జరిగిన పిమ్మట మరో భార్య ద్వారా అతనికి పిల్లలు కలిగారు.

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 షహరయీముకు హూషీము వల్ల అహీటూబు, ఎల్పయలు అనేవారు పుట్టారు.

12 [This verse may not be a part of this translation]

13 [This verse may not be a part of this translation]

14 బెరీయా కుమారులు షాషకు, యెరేమోతు,

15 జెబద్యా, అరాదు, ఏదెరు,

16 మిఖాయేలు, ఇష్పా, యోహా అనేవారు.

17 ఎల్పయలు కుమారులు జెబద్యా, మెషుల్లాము, హిజికి, హెబెరు,

18 ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు అనేవారు.

19 షిమీ కుమారులు యాకీము, జిక్రీ, జబ్ది,

20 ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,

21 అదాయా, బెరాయా, షిమ్రాతు అనేవారు.

22 షాషకు కుమారులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,

23 అబ్దోను, జిఖ్రి, హానాను,

24 హనన్యా, ఏలాము, అంతోతీయా,

25 ఇపెదయా, పెనూయేలు అనేవారు.

26 యెరోహాము కుమారులు షంషెరై, షెహర్యా, అతల్యా,

27 యూరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ అనేవారు.

28 వీరంతా కుటుంబ పెద్దలు. వారు తమ వంశ చరిత్రలో నాయకులుగా పేర్కొనబడ్డారు. వారు యెరూషలేములో నివసించారు.

29 యెహీయేలు అనేవాడు గిబియోను తండ్రి. యెహీయేలు భార్య మయకా.

30 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని ఇతర కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,

31 గెదోరు, అహ్యో, జెకెరు, మరియు మిక్లోతు.

32 మిక్లోతు కుమారుని పేరు షిమ్యా. ఈ కుమారులు కూడ వారి బంధువులకు దగ్గరగనే యెరూషలేములో నివసించారు.

33 నేరు కుమారుడు కీషు. కీషు కుమారుడు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, మరియు ఎష్బయలు.

34 యోనాతాను కుమారుడు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

35 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ, ఆహాజు అనేవారు.

36 ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా.

37 మెజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రాపా. రాపా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

38 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారి పేర్లు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వీరంతా ఆజేలు కుమారులు.

39 ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు.

40 ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా బెన్యామీను సంతతివారు.

9

1 ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబలోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.

2 మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.

3 యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:

4 అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.

5 యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.

6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.

7 మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు.

8 యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు.

9 [This verse may not be a part of this translation]

10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను,

11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి.

12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.

13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.

14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు.

15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తం0డ్రి ఆసాపు.

16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.

17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు.

18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు.

19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు.

20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది.

21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.

22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు.

23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది.

24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి.

25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.

26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు.

27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.

28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినప్పుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు.

29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.

30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.

31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు.

32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.

33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.

34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.

35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా.

36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు,

37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు.

38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.

39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.

40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.

41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు.

42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా,

43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.

44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజీక్రాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.

10

1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు.

2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీ షూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.

3 సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.

4 అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.” కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు.

5 సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు.

6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.

7 లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.

8 శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు.

9 ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు.

10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను గుడిలో వేలాడదీసారు.

11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు.

12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు కింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.

13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు.

14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.

11

1 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం).

2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”

3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.

4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు

5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.

6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.

7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది.

8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు.

9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.

10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.

11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా: హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పైఅధికారి . అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.

12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు.

13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు.

14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.

15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.

16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది.

17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు.

18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు.

19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.

20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు.

21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.

22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది.

23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు.

24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు.

25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.

26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా: యోవాబు సోదరుడైన ఆశాహేలు. దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.

27 హరోరీయుడైన షమ్మోతు. పెలోనీయుడైన హేలెస్సు.

28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు. అనాతోతీయుడైన అబీయెజెరు.

29 హుషాతీయుడైన సిబ్బెకై. అహోహీయుడైన ఈలై.

30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు. హేలెదు కూడ నెటోపాతీయుడు.

31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి. పిరాతోనీయుడైన బెనాయా,

32 గాయఘలోయవాడైన హురై, అర్బాతీయుడైన అబీయేలు,

33 బహరూమీయుడైన అజ్మావెతు. షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా

34 హాషేము కుమారుడు హాషేము గిజోనీయుడు. షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.

35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు. ఊరు కుమారుడు ఎలీపాలు.

36 మెకేరాతీయుడైన హెపెరు. పెలోనీయుడగు అహీయా.

37 కర్మెలీయుడైన హెజ్రో. ఎజ్బయి కుమారుడైన నయరై.

38 నాతాను సోదరుడైన యోవేలు. హగ్రీ కుమారుడగు మిబ్హారు.

39 అమ్మోనీయుడగు జెలెకు. బెరోతీయుడగు నహరై. నహరై అనేవాడు యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.

40 ఇత్రీయుడైన ఈరా. ఇత్రీయుడగు గారేబు.

41 హిత్తీయుడైన ఊరియా. అహ్లయి కుమారుడు జాబాదు.

42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.

43 మయకా కుమారుడు హానాను. మిత్నీయుడైన యెహోషాపాతు.

44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా. హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.

45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు. తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.

46 మహవీయుడగు ఎలీయేలు. ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.

47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.

12

1 దావీదు సిక్లగు పట్టణంలో ఉన్నాడు. ఆ సమయంలో కొందరు మనుష్యులు దావీదును కలుసుకొన్నారు. దావీదు పారిపోయి సౌలుకు కనపడకుండా దాగివున్న రోజులవి. కీషు కుమారుడు సౌలు. ఈ వచ్చిన మనుష్యులు దావీదుకు యుద్ధంలో సహాయపడ్డారు.

2 ఈ మనుష్యులు కుడి చేతితోను, ఎడమ చేతితోను బాణాలు ఒడుపుగా వేయగల నేర్పరులు. వడిసెలకూడ వారు కుడి ఎడమల తేడా లేకుండా తిప్పి రాళ్లు విసరగల సమర్థులు. వారంతా సౌలు బంధువులైన బెన్యామీనీయులు.

3 వారెవరనగా: అహీయెజెరు వారి నాయకుడు. వారిలో యోవాషు కూడ వున్నాడు. అహీయెజెరు, యోవాషులిద్దరూ షెమయా కుమారులు. షెమయా అనేవాడు గిబియావాడు. వారిలో ఇంకా యెజీయేలు, పెలెటు వున్నారు. యెజీయేలు, పెలెటులిరువురూ అజ్మావెతు కుమారులు. బెరాకా, అనాతోతీయుడైన యెహూ అనేవారు కూడ వారితో వున్నారు.

4 గిబియోనీయుడైన ఇష్మయా బలపరాక్రమ సంపన్నుడు. ముప్పై మంది యోధుల్లో ఒకడు మరియు వారి నాయకుడు. యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు కూడ వున్నారు.

5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా మరియు షెమర్యా. హరీపీయుడైన షెఫట్యా.

6 ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజేరు, యాషాబాము అనే వారు కోరహు వంశీయులు.

7 యెరోహాము కుమారులైన యోహేలా మరియు జెబద్యా. వారు గెదోరు గ్రామానికి చెందిన వారు.

8 గాదీయులలో కొంతమంది ఎడారి ప్రాంతంలో కోటలో దాగివున్న దావీదును కలిశారు. వారు బాగా యుద్ధ శిక్షణ పొందిన సైనికులు. వారు డాలు పట్టి ఈటెను ఉపయోగించటంలో ఆరితేరినవారు. వారు సింహం లాంటి ముఖాలతో భయంకరంగా వుంటారు. వారు కొండల్లో జింకల్లా పరుగెత్తగలరు.

9 ఏజెరు గాదు సైన్యానికి అధిపతి. ఓబద్యా రెండవ ముఖ్యాధికారి. ఏలీయాబు మూడవ స్థానంలో వున్నాడు.

10 మిష్మన్నా నాల్గవ స్థానంలోను, యిర్మీయా ఐదవ స్థానంలోను వున్నారు.

11 అత్తయి ఆరవ స్థానంలోను, ఏలీయేలు ఏడవ స్థానంలోను వున్నారు.

12 యోహానాను ఎనిమిదవ స్థానంలోను, ఎల్జాబాదు తొమ్మిదవ స్థానంలోను వున్నారు.

13 యిర్మీయా పదవ స్థానంలోను, మక్బన్నయి పదకొండవ వాడుగాను వున్నారు.

14 వారు గాదీయుల సైన్యంలో అధికారులు. వారిలో అతి బలహీనుడైనవాడు కూడ కనీసం వంద మందితో పోరాడగలడు. వారిలో మిక్కిలి బలవంతుడు వేయి మంది శత్రు సైనికులను ఎదుర్కొనగలడు.

15 ఈ గాదు వంశీయులే మొదటి నెలలో యొర్దాను నదికి వరదలు వచ్చే సమయంలో లోయల్లో వుండే వారందరినీ తరిమికొట్టారు. వారా ప్రజలను తూర్పునకు, పడమరకు తరిమివేశారు.

16 బెన్యామీను, యూదా వంశాలకు చెందిన ఇతర ప్రజలు కూడ కోటలో వున్న దావీదు వద్దకు వచ్చారు.

17 దావీదు వారిని కలిసేందుకు ఎదురు వెళ్లి, వారితో ఇలా అన్నాడు: “మీరు శాంతి భావంతో నాకు సహాయం చేయగోరి వస్తే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను! నాతో కలిసి ఉండండి. ఒకవేళ నేను ఏమీ తప్పు చేయకపోయినా మీరు నా మీద నిఘావేసి నన్ను శత్రువులకు అప్పజెప్పటానికి కనుక వస్తే, మన పూర్వీకుల దేవుడు మీరు చేసేది చూచి మిమ్మల్ని శిక్షించుగాక!”

18 అప్పుడు దేవుని ఆత్మ అమాశై మీదికి వచ్చింది. అమాశై ముప్పదిమంది వీరుల నాయకుడు. అమాశై అప్పుడు ఇలా అన్నాడు: “ఓ దావీదూ, మేము నీవారం! ఓ యెష్షయి కుమారుడా, మేము నీతో వున్నాము. శాంతి! నీకు శాంతి కలుగుగాక! నీకు సహాయపడే ప్రజలకు కూడ శాంతి. ఎందువల్లననగా నీ దైవం నీకు సహాయపడుతున్నాడు!” అప్పుడు దావీదు వారికి స్వాగతం పలికి వారిని చేరదీశాడు. తన పక్షాన వారిని దళాధిపతులుగా నియమించాడు.

19 కొందరు మనష్షే వంశంలోని వారు కూడ వచ్చి దావీదు పక్షం వహించారు. అతడు ఫిలిష్తీయులతో కలిసి సౌలుపై యుద్ధానికి వెళ్లినప్పుడు వారు వచ్చి దావీదు పక్షం వహించారు. కాని దావీదు, అతని మనుష్యులు నిజానికి ఫిలిష్తీయులకు సహాయపడలేదు. దావీదు తమకు సహాయం చేసే విషయం ఫిలిష్తీయుల అధికారులు చర్చించి, పిమ్మట అతనిని పంపివేయటానికి నిశ్చయించారు. ఫిలిష్తీయుల పాలకులు ఇలా అన్నారు: “ఒకవేళ దావీదు మధ్యలో తన యజమాని సౌలు వద్దకు వెళ్లిపోతే మన తలలు తెగిపోతాయి!”

20 దావీదు సిక్లగు పట్టణానికి వెళ్లినప్పుడు అతనితో కలిసిన మనష్షీయులు ఎవరనగా: అద్నా, యోజాబాదు, మెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు మరియు జిల్లెతై. వీరిలో ప్రతి ఒక్కడూ మనష్షే వంశీయులలో వెయ్యి మందికి నాయకుడు.

21 దుష్టశక్తులను ఎదుర్కొనటంలో వారు దావీదుకు తోడ్పడ్డారు. ఈ దుష్టులు దేశం మీద పడి ప్రజలను దోచుకోసాగారు. దావీదును చేరిన మనష్షీయులంతా ధైర్యంగల సేనానులు. వారు దావీదు సైన్యంలో అధిపతులయ్యారు.

22 రోజురోజుకూ దావీదు వద్దకు వచ్చి సహాయపడేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానితో దావీదుకు శక్తివంతమైన ఒక మహా సైన్యం ఏర్పడింది.

23 దావీదును హెబ్రోను పట్టణంలో కలిసిన వారి వివరాలు, సంఖ్యాబలం ఈ విధంగా వున్నాయి: వారు యుద్ధ వీరులు. సౌలు సామ్రాజ్యాన్ని దావీదుకు అప్పజెప్పటానికి వచ్చారు. ఇది ఇలా జరుగుతుందని యెహోవా చెప్పియున్నాడు. వారి బలగం ఏదనగా:

24 యుద్ధానికి అర్హతగల యూదా వంశీయులు ఆరువేల ఎనిమిది వందల మంది వున్నారు. వారు డాళ్లను, ఈటెలను పట్టగల సమర్థులు.

25 షిమ్యోనీయులు ఏడువేల వందమంది వున్నారు. వారంతా ధైర్య సాహసాలుగల సైనికులు.

26 లేవీయులు నాలుగువేల ఆరువందల మంది వున్నారు.

27 యెహోయాదా ఆ వర్గంలో వాడు. అతడు అహరోను కుటుంబ పెద్ద. యెహోయాదాతో మూడువేల ఏడువందల మంది మనుష్యులున్నారు.

28 ఆ వర్గంలో సాదోకు కూడా వున్నాడు. అతడు మంచి ధైర్యంగల యువ సైనికుడు. అతడు తన కుటుంబీకులలో ఇరవై ఇద్దరు అధికారులతో వచ్చాడు.

29 బెన్యామీను వంశం వారు మూడువేలమంది వున్నారు. వారంతా సౌలుకు బంధువులు. అప్పటి వరకు వారిలో అధిక సంఖ్యాకులు సౌలు కుటుంబం పట్ల విశ్వాసంగా వున్నారు.

30 ఎఫ్రాయిము వంశంవారు ఇరవైవేల ఎనిమిది వందలమంది వున్నారు. వారు ధైర్యంగల సేనానులు. వారి వారి కుటుంబాలలో వారు ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు.

31 మనష్షే వంశీయులలో సగంమంది నుండి వచ్చిన వారు పద్దెనిమిదివేల మంది. వారు పేరు పేరున దావీదును రాజుగా చేయటానికి ఎంపిక చేయబడినవారు.

32 ఇశ్శాఖారు వంశీయులలో తెలివైన పెద్దలు రెండు వందల మంది. ఇశ్రాయేలుకు చేయదగిన మంచి యేదో వారు సరియైన సమయంలో గుర్తించారు. వారి బంధువులంతా వారి మాటకు కట్టుబడి వున్నారు.

33 జెబూలూనీయులు ఏబదివేల మంది వున్నారు. వారంతా అనుభవజ్ఞులైన సైనికులు. వారు రకరకాల ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు దావీదుకు మిక్కిలి నమ్మకస్తులై వున్నారు.

34 నఫ్తాలీయుల నుండి ఒక వెయ్యిమంది అధిపతులు వచ్చారు. వారికి ముప్పది ఏడువేల మంది అనుచరులు వున్నారు. వారు ఈటెలు, డాళ్లు పట్టి వున్నారు.

35 దాను వంశం నుండి యుద్ధానికి సిద్ధంగా వున్న వారు ఇరవై ఎనిమిదివేల ఆరువందల మంది.

36 ఆషేరు వంశం నుండి కాకలు తీరిన సైనికులు యుద్ధానికి సిద్ధమై నలభై వేలమంది వచ్చారు.

37 యొర్దాను నదికి ఆవలివైపు (నదికి తూర్పు) నుండి రూబేను, గాదు, సగం మనష్షే వంశీయుల నుండి ఒక లక్షా ఇరవై వేల మంది వచ్చారు. వారంతా రకరకాల ఆయుధాలు ధరించియున్నారు.

38 ఆ వచ్చిన మనుష్యులంతా పోరాట యోధులు. దావీదును ఇశ్రాయేలుకంతటికి రాజుగా చేయాలనే కృతనిశ్చయంతో ఆ వీరులందరూ హెబ్రోను పట్టణానికి వచ్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు కూడ దావీదును రాజుగా చేయటానికి ఒప్పుకున్నారు.

39 ఆ మనుష్యులంతా దావీదుతో మూడు రోజులు హెబ్రోనులో గడిపారు. వారి బంధువులంతా తగినన్ని ఆహార పదార్థాలను తయారు చేయటంతో వారు బాగా అన్నపానాదులు సేవించి కాలం గడిపారు.

40 ఇశ్శాఖారు, జెబూలూను మరియు నఫ్తాలి వంశాల వారి ఇరుగు పొరుగు వారు కూడ గాడిదలమీద, ఒంటెలమీద, కంచర గాడిదల మీద, ఎద్దుల మీద ఆహార పదార్థాలు వేసుకొని వచ్చారు. వారు కావలసినంత పిండిని, అంజూర పండ్ల భక్ష్యాలను, ఎండుద్రాక్షను, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువులను, గొర్రెలను తీసుకొని వచ్చారు. ఇశ్రాయేలంతటా సంతోషం వెల్లివిరిసింది.

13

1 దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు.

2 పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి.

3 ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.”

4 దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు.

5 కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబో హమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయు లందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు.

6 దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.

7 ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు.

8 దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.

9 వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు కిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు.

10 ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు.

11 ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా” అని పిలవబడుతూ వుంది.

12 ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు.

13 కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు.

14 మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.

14

1 తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు.

2 యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు.

3 యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు.

4 యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,

5 ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు,

6 నోగహు, నెపెగు, యాఫీయ,

7 ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు.

8 దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు.

9 ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు.

10 అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు. యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు.

11 తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము అని పేరు పెట్టబడింది.

12 ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు.

13 రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు దాడి చేశారు.

14 దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు.

15 ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల కింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!”

16 దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు.

17 అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.

15

1 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు.

2 “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను అర్పించటానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.

3 తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు.

4 అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.

5 కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.

6 మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.

7 గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.

8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.

9 హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.

10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.

11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు.

12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి.

13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”

14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు.

15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.

16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.

17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు.

18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.

19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు.

20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి.

21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని.

22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.

23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు.

24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.

25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు.

26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు.

27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.

28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్మలు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.

29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.

16

1 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు.

2 దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు.

3 అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

4 ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు.

5 వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణాసితార వాద్యాలను వాయించేవారు.

6 యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు.

7 అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

8 యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి. యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.

9 యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి. యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!

10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి; యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖ సంతోషాలు పొందెదరు గాక!

11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.

12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.

13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డల్లారా, యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.

14 యెహోవాయే మన దేవుడు ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!

15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు. ఆయన మాట వేయితరాల పంట!

16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక. అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం

17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు. అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.

18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.

19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే. వారు ఆ రాజ్యంలో పరాయి వారు.

20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు. వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.

21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.

22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు; నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!” అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.

23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి! యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!

24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి. దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!

25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.

26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే! కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.

27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు. యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!

28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!

29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి! మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!

30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి. కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.

31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక! “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!

32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక! పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబచ్చుగాక!

33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి! ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.

34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు! యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.

35 “మా సంరక్షకుడవగు ఓ దేవా! మమ్ములను రక్షింపుము! మమ్ము ఒక దగ్గరికి చేర్చి మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము. అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము. మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.

36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక! అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు.

38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెండ్రి పేరు యెదూతూను.

39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు.

40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు.

41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక.

42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.

17

1 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”

2 “నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.

3 కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది.

4 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు.

5 [This verse may not be a part of this translation]

6 [This verse may not be a part of this translation]

7 “కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను.

8 నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను.

9 ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లకింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు.

10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను. “‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను .

11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను.

12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను.

13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను

14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”

15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.

16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు.

17 వాటన్నిటికీ మంచి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు!

18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు!

19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు!

20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు!

21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు!

22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!

23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి!

24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.

25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను.

26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు.

27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”

18

1 తరువాత దావీదు ఫిలిష్తీయులపైకి దండెత్తి వారిని ఓడించాడు. ఫిలిష్తీయులనుండి గాతు నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశపర్చుకున్నాడు.

2 పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.

3 హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు.

4 హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.

5 దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబారాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండువేల సిరియను సైనికులను చంపివేశాడు.

6 తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.

7 హదదెజెరు సైన్యాధికారుల నుండి బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు.

8 తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.

9 హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు హదదెజెరు. హదదెజెరు సైన్యాన్నంతా దావీదు ఓడించాడని తోహూ విన్నాడు.

10 తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు.

11 రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.

12 సెరూయా కుమారుడైన అబీషై “ఉప్పులోయ” అని పిలవబడే స్థలంలో పద్దెనిమిదివేల ఎదోమీయులను చంపివేసాడు.

13 ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.

14 ఇశ్రాయేలంతటికీ దావీదు రాజు. ప్రతి పౌరునికీ ఏది మంచిదో, న్యాయమైనదో దావీదు వారికి అది చేశాడు.

15 సెరూయా కుమారుడు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కుమారడైన యెహోషాపాతు దావీదు చేసిన విషయాలన్నీ గ్రంథ రూపంలో రాశాడు.

16 సాదోకు, అబీమెలెకు యాజకులు. సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి అబ్యాతారు. షవ్షా లేఖకుడు.

17 కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.

19

1 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు.

2 ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.

3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.”

4 దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.

5 దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”

6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు.

7 అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.

8 అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబను, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు.

9 అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేవలతో బయట పొలాలలో దిగియుండిరి.

10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు.

11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు.

12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను.

13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”

14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది.

15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.

17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు.

18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.

19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.

20

1 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.

2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు.

3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.

5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.

6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే.

7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.

8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.

21

1 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు .

2 కావున దావీదు యోవాబను, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.

3 కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”

4 కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి

5 దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు.

6 లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు.

7 దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలు శిక్షించాడు.

8 పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”

9 [This verse may not be a part of this translation]

10 [This verse may not be a part of this translation]

11 [This verse may not be a part of this translation]

12 [This verse may not be a part of this translation]

13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయండి.”

14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు.

15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టనప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీ యుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.

16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు.

17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”

18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.”

19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.

20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు.

21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.

22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.

23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనండి! నీవు నా ఏలినవాడవైన రాజువు. మీరు కోరిన విధంగా చేయండి. చూడండి, దహన బలులుగా సమర్పించటానికి నేను మీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి మీకు కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను మీకు గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ మీకు ఇస్తాను!”

24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”

25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు.

26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని కిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది.

27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.

28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు.

29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు.

30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)

22

1 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.

2 ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని.

3 దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు.

4 దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.

5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.

6 పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు.

7 సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవానామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను.

8 కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని వధించావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు.

9 కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను . సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను.

10 “నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నా కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వ్యవహరిస్తాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!”‘

11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక!

12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు.

13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయ పడవద్దు.

14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను రెండు మణుగుల (మూడువేల ఏడువందల ఏభై టన్నులు) బంగారాన్ని, పదికోట్ల మణుగుల (ముఫై ఏడువేల ఐదువందల టన్నులు) వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు.

15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు.

16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”

17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.

18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు.

19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”

23

1 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు.

2 ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు.

3 లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు.

4 దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు.

5 నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”

6 దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.

7 లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు.

8 లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు.

9 షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.

10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా , యూషు, బెరీయా.

11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.

12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.

13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.

14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు.

15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు.

16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు .

17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.

18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.

19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.

20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.

21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు.

22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు.

23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.

24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.

25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు.

26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”

27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.

28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని.

29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు.

30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు.

31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి.

32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ వారు తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు. యాజకులకు సేవను కేటాయించడం

24

1 అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

2 కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు.

3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు.

4 ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు.

5 ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.

6 షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షెమయా రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.

7 మొదట ఎంపిక చేయబడినది యెహోయారీబు వంశంవారు. రెండవ చీటీలో యెదాయా వంశం వారు ఎంపిక చేయబడ్డారు.

8 మూడవ వంశం హారీము వారు. నాల్గవ వంశం శెయొరీము వారు.

9 ఐదవ వంశం మల్కీయాకు చెందినది. ఆరవది మీయామిను వంశానికి చెందినది.

10 ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది. ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.

11 తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక అయ్యింది. పదవ వంశం షెకన్యాది.

12 పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది. పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది.

13 పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది. పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.

14 పదిహేనవ చీటి బిల్గా వంశానికి పడింది పదహారవ చీటి ఇమ్మేరు వంశం వారికి వచ్చింది.

15 పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది. పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.

16 పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు. ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.

17 ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది. ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.

18 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది. ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది.

19 ఈ వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.

20 మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి: అమ్రాము సంతానం నుండి షూబాయేలు. షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.

21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడైన ఇష్షీయా.

22 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు. షెలోమోతు వంశం నుండి యహతు.

23 హెబ్రోను పెద్ద కుమారుడు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవ వాడు యహజీయేలు. నాల్గవ కుమారుడు యెక్మెయాము.

24 ఉజ్జీయేలు కుమారుడు మీకా. మీకా కుమారుడు షామీరు.

25 మీకా సోదరుడు ఇష్షీ ఇష్షీ కుమారుడు జెకర్యా.

26 మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు

27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు.

28 మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.

29 కీషు కుమారుడు యెరహ్మెయేలు.

30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు. వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి.

31 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులకు కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.

25

1 దావీదు, సైన్యాధికారులు కలిసి ఆసాపు కుమారులను ప్రత్యేక సేవల కొరకు కేటాయించారు. ఆసాపు కుమారులు హేమాను, యెదూతూను అనేవారు. ప్రవచనాలు చెప్పటం, తంబుర, సితారులను, తాళాలను వాయిస్తూ దేవుని వాక్యం ప్రకటించటం వారి విశేష సేవా కార్యక్రమం. ఈ విధమైన అసాధారణ సేవలో వున్న వారి పేర్లు ఏవనగా:

2 ఆసాపు కుటుంబం నుండి జక్కూరు, యోసేపు, నెతన్యా మరియు అషర్యేలా. రాజైన దావీదు ప్రవచించటానికి ఆసాపును ఎంపికచేశాడు. ఆసాపు తన కుమారులకు నాయకత్వం వహించాడు.

3 యెదూతూను కుటుంబం నుండి గెదల్యా, జెరీ, యెషయా, షిమీ, హషబ్యా, మత్తిత్యా అనువారు ఆరుగురు. యెదూతూను తన కుమారులకు నాయకత్వం వహించాడు. యెదూతూను ప్రవచించటానికి సితారు వాయించే వాడు. యెహోవాకి వందనాలు చెల్లిస్తూ స్తుతి పాటలు పాడేవాడు.

4 దేవుని సేవలో నిమగ్నమైన హేమాను కుమారులైన బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షూబాయేలు మరియు యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తీయెజెరు, యెష్బెకాషా, మల్లోతి, హోతీరు మరియు మహజీయోతు.

5 వీరంతా హేమాను కుమారులు. హేమాను దీర్ఘదర్శి (ప్రవక్త) హేమానును బలపరుస్తానని దేవుడు మాటయిచ్చాడు. అందువల్ల హేమాను బహు సంతానవంతుడయ్యాడు. దేవుడు హేమానుకు పధ్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను కలుగజేశాడు.

6 హేమాను తన కుమారులందరినీ ఆలయంలో భక్తి పాట సంకీర్తనలో పాల్గొనేలా చేసాడు. అతని కుమారులంతా తాళాలు, సితారాలు, వీణలు వాయించేవారు. అది వారు ఆలయంలో సేవచేసే పద్ధతి. రాజైన దావీదు వారిని ఎంపిక చేశాడు.

7 వారితో పాటు వారి బంధువులైన లేవి వంశీయులు కూడ పాటలు పాడటంలో శిక్షణ పొందారు. అలా దేవునికి స్తుతి పాటలు పాడటం నేర్చుకున్న వారిలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది వున్నారు.

8 ప్రతి ఒక్కడూ ఏ పని చేయాలో నిర్ణయించటానికి వారు చీట్లు వేసారు. ప్రతి ఒక్కడూ సమానంగా చూడబడ్డాడు. చీట్లు వేయటంలో చిన్న, పెద్ద, గురువు, శిష్యుడు అనే తేడా లేకుండా అంతా సమానంగా చూడబడ్డారు.

9 మొదటిగా ఆసాపు (యోసేపు) కుమారులు, బంధువుల నుండి పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. రెండవ చీటి ద్వారా గెదల్యా కుమారులు, బంధువుల నుండి మొత్తం పన్నెండు మంది ఎంపికైనారు.

10 మూడవ చీటి జక్కూరు పేరున పడగా అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎన్నుకోబడ్డారు.

11 నాల్గవసారి యిజీ కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.

12 ఐదవ చీటీ ద్వారా నెతన్యా కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.

13 ఆరవ చీటీ ద్వారా బక్కీయాహు కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎన్నుకోబడ్డారు.

14 ఏడవ చీటీ యెషర్యేలా పేరున వచ్చింది. అతని కుమారులు, బంధువులు, పన్నెండుమంది ఎంపికైనారు.

15 ఎనిమిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ యెషయా కుమారులు, బంధువులు.

16 తొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మత్తన్యా కుమారులు, బంధువులు.

17 పదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షిమీ కుమారులు, బంధువులు.

18 పదకొండవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ అజరేలు కుమారులు, బంధువులు.

19 పన్నెండవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ హష్బయ్యా కుమారులు, బంధువులు.

20 పదమూడవ చీటి ద్వారా ఎంపికైన పన్నెండు మందీ షూబాయేలు కుమారులు, బంధువులు.

21 పధ్నాల్గవ చీటి మత్తిత్యాకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

22 పదిహేనవ చీటి యెరేమోతుకు వెళ్లింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

23 పదహారవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు హనన్యా కుమారులు, బంధువులు.

24 పదిహేడవ చీటీ ద్వారా పన్నెండుగురు ఎంపిక చేయబడ్డారు. వారు యొష్బెకాషా కుమారులు, బంధువులు.

25 పద్దెనిమిదవ చీటీ ద్వారా ఎంపికైనవారు పన్నెండు మంది. వారు హనానీ కుమారులు, బంధువులు.

26 పందొమ్మిదవ చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ మల్లోతి కుమారులు, బంధువులు.

27 ఇరవయ్యో చీటీ ద్వారా ఎంపికైన పన్నెండు మందీ ఎలీయ్యాతా కుమారులు, బంధువులు.

28 ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

29 ఇరవై రెండవ చీటి గిద్దల్తీకి వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు.

30 ఇరవై మూడవ చీటి మహజీయోతుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుమంది ఎంపికైనారు.

31 ఇరవై నాల్గవ చీటీ రోమమ్తీయెజెరుకు వచ్చింది. అతని కుమారులు, బంధువులు పన్నెండు మంది ఎంపికైనారు.

26

1 కోరహు వంశం నుండి వచ్చిన ద్వారపాలకుల జట్టులు ఏవనగా: మెషెలెమ్యా మరియు అతని కుమారులు, (మెషెలెమ్యా తండ్రి పేరు కోరే. అతడు ఆసాపు వంశంలోని వాడు.)

2 మెషెలెమ్యా సంతానవంతుడు. జెకర్యా పెద్దవాడు. యెదీయవేలు రెండవవాడు. జెబద్యా మూడవవాడు. యత్నీయేలు నాల్గవవాడు.

3 ఏలాము ఐదవ కుమారుడు. యెహోహనాను ఆరవవాడు. ఎల్యోయేనై ఏడవ కుమారుడు.

4 ఓబేదెదోము, అతని కుమారులు. ఓబేదెదోము పెద్ద కుమారుడు షెమయా. యెహోజాబాదు అతని రెండవ కుమారుడు. యోవాహు మూడవవాడు. శాకారు అతని నాల్గవ కుమారుడు. నెతనేలు అయిదవవాడు.

5 అమ్మీయేలు ఆరవవాడు. ఇశ్శాఖారు అతని ఏడవ కుమారుడు. పెయుల్లెతై అతని ఎనిమిదవ కుమారుడు. దేవుడు నిజంగా ఓబేదెదోమును ఆశీర్వదించాడు.

6 ఓబేదెదోము కుమారుడు షెమయా. షెమయాకు కూడ కుమారులున్నారు. తన తండ్రి కుటుంబంలో షెమయా కుమారులంతా ధైర్యంగల సేనానులు కావటంతే వారు నాయకులయ్యారు.

7 షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, ఎలీహు, మరియు సెమక్యా అనేవారు. ఎల్జాబాదు బంధువులు నేర్పరులైన పనివారు.

8 వారంతా ఓబేదెదోము సంతతివారు. వారు, వారి కుమారులు, బంధువులు అంతా పరాక్రమశాలురు. వారు మంచి రక్షక భటులు. ఓబేదెదోము సంతతివారు అరువది ఇద్దరు.

9 మెషెలెమ్యా కుమారులు, బంధువులు పరాక్రమవంతులు. అతని కొడుకులు, బంధువులు కలిసి పద్దెనిమిది మంది వున్నారు.

10 మెరారీ వంశానికి చెందిన ద్వారపాలకులు ఎవరనగా, హోసా పెద్ద కుమారునిగా షిమ్రీ పరిగణింపబడ్డాడు. నిజంగా షిమ్రీ పెద్ద కుమారుడు కాదు. కాని అతని తండ్రి అతనిని పెద్దవాడుగా ఆదరించాడు.

11 హిల్కీయా అతని రెండవ కుమారుడు. టెబల్యాహు అతని మూడవ కుమారుడు. జెకర్యా నాల్గవవాడు. అంతా కలిసి హోసాకు పదముగ్గురు కుమారులు, బంధువులు వున్నారు.

12 వీరు ద్వారపాలకుల జట్ల నాయకులు. వీరి ఇతర బంధువుల వలెనే ద్వారపాలకులకు ఆలయ సేవలో ఒక విశిష్టమైన పద్ధతి వుంది.

13 ప్రతి కుటుంబానికి ఒక ద్వారం కాపలా కొరకు కేటాయించబడింది. ప్రతి కుటుంబానికీ ద్వారాలు నిర్ణయించటానికి చీట్లు వేయబడ్డాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే భేధం పాటించకుండా అంతా సమంగా చూడబడ్డారు.

14 చీట్లు వేయగా తూర్పు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. షెలెమ్యా కుమారుడు జెకర్యాకు కూడ చీట్లు వేయబడ్డాయి. జెకర్యా చాలా తెలివైన సలహాదారు. ఉత్తర ద్వారం జెకర్యాకు వచ్చింది.

15 ఓబేదెదోముకు దక్షిణ ద్వారం వచ్చింది. ఓబేదెదోము కుమారులు విలువైన వస్తువులు దాచే ఇంటి కాపలాకై ఎంపిక చేయబడ్డారు.

16 షుప్పీము, హోసా పడమటి ద్వారం కాపలాకు, ఎగువ మార్గంలో వున్న షల్లెకెతు ద్వారం కాపలాకు ఎంపిక చేయబడ్డారు. భటులు ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడ్డారు.

17 తూర్పుద్వారం వద్ద ప్రతి రోజూ ఆరుగులు లేవీయులు కాపలా వుండేవారు. ఉత్తర ద్వారం వద్ద ప్రతి రోజూ ఐదుగురు లేవీయులు నిలబడేవారు. దక్షిణ ద్వారం వద్ద నలుగురు లేవీయులు నిలబడేవారు. విలువైన వస్తువులు దాచే ఇంటివద్ద ఇద్దరు లేవీయులు కాపలా వుండేవారు.

18 పడమటి సభాస్థానం వద్ద నలుగురు భటులు కాపలా వుండేవారు. సభాస్థానికి వెళ్లే బాటమీద ఇద్దరు భటులు వుండేవారు.

19 ఇవి ద్వారపాలకుల జట్లు. ఆ ద్వారపాలకులు కోరహు (కోరే), మెరారి సంతతివారు.

20 అహీయా లేవీయుల వంశంవాడు. దేవాలయంలో విలువైన వస్తువుల పరిరక్షణ అహీయా బాధ్యత. పవిత్ర వస్తువులు, పరికరాలు వుంచిన స్థలాలను కాపాడటం కూడా అహీయా బాధ్యత.

21 గెర్షోను తెగవారిలో లద్దాను ఒక కుటుంబపు మూలపురుషుడు. యెహీయేలీ అనేవాడు లద్దాను వంశంలో ఒక నాయకుడు.

22 యెహీయేలీ కుమారులు జేతాము, అతని సోదరుడైన యోవేలు. దేవాలయంలో విలువైన వస్తువులన్నిటి పరిరక్షణ వారి బాధ్యత.

23 ఇతర నాయకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను మరియు ఉజ్జీయేలు వంశాల నుండి ఎంపిక చేయబడ్డారు.

24 ఆలయంలో విలువైన వస్తువులపై కాపలా షూబాయేలు బాధ్యత. షూబాయేలు తండ్రి పేరు గెర్షోము. గెర్షోము తండ్రి పేరు మోషే.

25 షూబాయేలు బంధువుల వివరాలు: ఎలీయెజెరు తరపున అతని బంధువులు ఎవరనగా: ఎలీయెజెరు కుమారుడు రెహబ్యా. రెహబ్యా కుమారుడు యెషయా. యెషయా కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు జిఖ్రీ. జిఖ్రీ కుమారుడు షెలోమీతు.

26 షెలోమీతు, అతని బంధువులు ఆలయానికై దావీదు సేకరించిన వస్తువులన్నిటిపై కాపలా వున్నారు. సైన్యాధికారులు కూడ ఆలయానికి విరాళాలు ఇచ్చారు.

27 వారు యుద్ధాలలో శత్రువుల నుండి తీసుకొన్న వస్తువులలో కొన్నింటిని కూడ విరాళంగా ఇచ్చారు. వాటన్నిటినీ వారు యెహోవా ఆలయ నిర్మాణంలో వినియోగించటానికి ఇచ్చారు.

28 షెలోమీతు, అతని బంధువులు కలిసి దీర్ఘదర్శియగు (ప్రవక్త) సమూయేలు, రాజైన సౌలు, నేరు కుమారుడగు అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి సంరక్షణ బాధ్యత కూడా వహించారు. షెలోమీతు, అతని బంధువులు యెహోవాకు ఇచ్చిన పవిత్ర వస్తువులన్నిటి విషయంలో జాగ్రత్త వహించారు.

29 కెనన్యా ఇస్హారు కుటుంబంలోని వాడు. కెనన్యా, అతని కుమారులు మందిరపు బయట బాధ్యతలు స్వీకరించారు. వారు రక్షకభటులుగాను, న్యాయాధిపతులుగాను ఇశ్రాయేలులో వివిధ ప్రాంతాలలో పని చేశారు.

30 హషబ్యా హెబ్రోను కుటుంబంలోని వాడు. హషబ్యా, అతని బంధువులు దేవుని అన్ని కార్యాలలోను; యోర్దాను నదికి పశ్చిమానగల ఇశ్రాయేలులో రాజుగారి పనులలోను శ్రద్ధ తీసుకొనే వారు. హషబ్యా వర్గంలో పదిహేడువేల మంది బలవంతులున్నారు.

31 వారికి యెరీయా పెద్ద అని హెబ్రోను కుటుంబ చరిత్ర తెలుపుతుంది. దావీదు నలుబది ఏండ్లు రాజుగా వున్న కాలంలో తన ప్రజల వంశ చరిత్రలు చూచి బలపరాక్రమాలుగల వారిని, నేర్పరులైన పనివారిని వెదుకమని ఆజ్ఞాపించాడు. అట్టివారిలో కొంతమంది గిలియాదులో గల యాజేరు పట్టణంలో నివసిస్తున్న హెబ్రోను వంశీయులలో వున్నట్లు కనుగొన్నారు.

32 యెరీయాకు రెండువేల ఏడువందల మంది బలవంతులైన, కుటుంబ పెద్దలైన బంధువులున్నారు. యెహోవా కార్యాలు చేయటంలోను, రాజు పనులు చక్కబెట్టటం లోను రూబేనీయుల, గాదీయుల మరియు మనష్షే సగం వంశీయుల పనిని పరిశీలించేందుకు రాజైన దావీదు యెరీయా బంధువులైన ఆ రెండువేల ఏడువందల మందిని నియమించాడు.

27

1 సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు.

2 మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు.

3 యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి.

4 రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు.

5 మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.

6 ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు.

7 నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు.

8 ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.

9 ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.

10 ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.

11 ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు.

12 తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.

13 పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు.

14 పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.

15 పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు.

16 ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా: రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు. “షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య.

17 లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు.

18 యూదా: దావీదు సోదరులలో ఒకడై ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ.

19 జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా. నఫ్తాలి: అజీ్రయేలు కుమారుడైన యెరీమోతు.

20 ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ. పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు.

21 తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో. బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు.

22 దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు.

23 ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు.

24 సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు . ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు.

25 రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా: అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాలలోను, గామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు ఇవ్వబడింది.

26 వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజీ నియమితుడయ్యాడు.

27 ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు. ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు.

28 పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు.

29 షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు.

30 ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు. గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనో తీయుడు.

31 గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు.

32 యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు.

33 అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు.

34 అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి.

28

1 దావీదు ఇశ్రాయేలు పెద్దలందరినీ సమావేశపర్చాడు. వారందరనీ యెరూషలేముకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఆయన పిలిచిన పెద్దలు ఎవరనగా: వంశాల పెద్దలు, రాజ సేవలో వున్న సైనికాధికారులు, వేయిమంది సైనికులకు అధిపతులు, వందమంది గల దళాలకు అధిపతులు, రాజు యొక్క, రాజకుమారుల యొక్క ఆస్తులను, పశువులను కాపాడే అధికారులు, రాజు యొక్క ముఖ్యాధికారులు, పరాక్రమశాలురు మరియు వీర సైనికులు.

2 రాజైన దావీదు నిలబడి వారినుద్దేశించి ఇలా చెప్పాడు: “సోదరులారా, నా ప్రజలారా, మీరంతా నేను చేప్పేది వినండి. యోహోవా ఒడంబడిక పెట్టెను ఉంచటానికి ఒక ఆలయాన్ని కట్టటానికి నేను నా హృదయంలో సంకల్పించాను దేవుని పాదం మోపటానికి ఒక స్థానం నిర్మించాలని నేను అనుకున్నాను. ఆలయ నిర్మాణానికి నేను ఒక పథకం కూడ తయారుచేశాను.

3 కాని దేవుడు నాతో ఇలా అన్నాడు: ‘దావీదూ’ వద్దు. నా పేరు మీద నీవు ఆలయం కట్టించకూడదు. నీవు సైనికుడవై, అనేకమందిని సంహరించావు. అందువల్ల నీవు ఆలయ నిర్మాణం చేయకూడదు.”

4 “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారిని నడిపించటానికి యూదా వంశాన్ని ఎంపిక చేశాడు. మళ్లీ ఆ వంశంలో నుండి నా తండ్రి కుటుంబాన్ని యోహోవా ఎంపిక చేశాడు. ఆ కుటుంబంలో నుండి ఇశ్రాయేలును శాశ్వతంగా ఏలటానికి యెహోవా నన్ను ఎంపికచేశాడు! దేవుడు నన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేయదలచాడు!

5 యెహోవా నాకు చాలా మంది కుమారులను ఇచ్చాడు. వారందరిలో ఇశ్రాయేలుకు నూతన రాజుగా సొలొమోనును మాత్రం యెహోవా ఎంపిక చేసాడు. నిజానికి ఇశ్రాయేలు యెహోవా రాజ్యం.

6 యెహోవా నాతో, ‘దావీదూ, నీ కుమారుడు సొలొమోను నా ఆలయాన్ని, దాని ప్రాంగణాన్ని నిర్మిస్తాడు. ఎందువల్లననగా సొలొమోనును నా కుమారునిగా భావించాను. నేను అతనికి తండ్రిగా వ్యవహరిస్తాను .

7 సొలొమోను ఇప్పుడు నా ధర్మాన్ని, ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అతడు నా ధర్మాన్ని, న్యాయాన్ని నిరంతరం పాటిస్తే నేను సొలొమోను రాజ్యాన్ని శాశ్వతంగా బలవంతమైనదిగా చేస్తాను!”‘ అని అన్నాడు.

8 “ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు, దేవుని సమక్షాన నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. యెహోవా దేవుని శాసనాలన్నిటినీ మీరు పాటించేలా జాగ్రత్త పడండి! అప్పుడు ఈ మంచి దేశాన్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. పైగా దీనిని మీరు, మీ తర్వాత మీ సంతతి వారికి కూడ శాశ్వతంగా అందజేయగలరు.

9 కుమారుడా, సొలొమోనూ! నీ తండ్రి యొక్క దేవుని నీవు తెలుసుకో. పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు. దేవుని సేవించటానికి హృదయానందం కలిగివుండు. ఎందువల్లననగా, ప్రతివాని మనస్సులో ఏమున్నదో దేవునికి తెలుసు. నీవు ఆలోచించే ప్రతిదీ యెహోవా అర్థం చేసుకుంటాడు! సహాయం కోరి యెహోవాను అర్థిస్తే, నీకు సమాధానం దోరుకుతుంది. నీవు దేవునికి విముఖంగా వుంటే ఆయన నిన్ను శాశ్వతంగా వదిలివేస్తాడు.

10 సొలొమోనూ, తన పవిత్ర స్థలమైన ఆలయాన్ని నిర్మించటానికి యెహోవా నిన్ను ఎంపిక చేశాడని నీవు అర్ధం చేసుకోవాలి. ధైర్యంగా వుండి కార్యం నెరవేర్చు.”

11 పిమ్మట దావీదు ఆలయ నిర్మాణానికి సిద్ధం చేసిన సమూనా పత్రాలను తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. ఆ పత్రాలలో ఆలయం చుట్టూ నిర్మింప తలపెట్టిన ఆవరణ, మండపాలు, వస్తువులను భద్రపరచు గదులకు పైగదులు, లోపలి గదులు మరియు పాపపరిహారం ప్రాయశ్చిత్తం చేయు స్థానం మొదలగు వాటి నమూనాలు కూడ ఇమిడి వున్నాయి.

12 ఆలయపు అన్ని విభాగాలకూ దావీదు నమూనాలు గీయించాడు. దావీదు ఆ నమూనాలను సొలొమోనుకు ఇచ్చాడు. ఆలయం చుట్టూ ప్రాంగణానికి, ఇతర గదులకు, వస్తువులను భద్రపరచు గదులకు, పవిత్ర వస్తువులను వుంచే కొట్లకు గీచిన నమూనాలను కూడ దావీదు అతనికి ఇచ్చాడు.

13 దావీదు సొలొమోనుకు యాజకులలోను, లేవీయులలోను గల వర్గీకరణలను గూర్చి తెలియ జెప్పాడు. ఆలయపు సేవాకార్యక్రమ వివరాలు, ఆలయంలో వినియోగించే వస్తుసామగ్రి విషయాల గూర్చి దావీదు సొలొమోనుకు వివరించాడు.

14 ఆలయంలో ఉపయోగించే వస్తు సామగ్రి చేయటానికి ప్రతి దానికీ ఎంతెంత వెండి బంగారాలు వినియోగించాలో దావీదు సొలొమోనుకు చెప్పాడు.

15 బంగారు దీపాలకు, వెండి దీపాలకు, దీప స్తంభాలకు విడివిడిగా కొలతలు, నమూనాలు వున్నాయి. ఒక్కొక్క దీప స్తంభానికి, దాని దీపాలకు ఉపయోగించే బంగారం లేక వెండి పరిమాణాన్ని దావీదు సొలొమోనుకు తెలియజేశాడు. అవసరమైన చోట వివిధ దీపస్తంభాలు నెలకొల్పవచ్చు.

16 నైవేద్యంగా పవిత్ర రొట్టెను దేవుని ముందు పెట్టటానికి పనికివచ్చే ప్రతి బల్లకు ఎంత బంగారం వాడాలో దావీదు చెప్పాడు. వెండి బల్లలకు కావలసిన వెండి పరిమాణం కూడా దావీదు చెప్పాడు.

17 శూలాలకు, నీరు చిలికే పాత్రలకు, మూతి వెడల్పు చెంబులకు ఎంతెంత శుద్ధ బంగారం కావాలో దావీదు వివరించాడు. ప్రతి బంగారు పాత్రకు, ప్రతి వెండి పాత్రకు ఎంతెంత బంగారం కావాలో దావీదు చెప్పాడు.

18 ధూప పీఠానికి కావలసిన శుద్ధ బంగారం విషయం దావీదు చెప్పాడు. దేవుని రథమైన రెక్కలుచాపి ఒడంబడిక పెట్టెను కప్పివుండే కెరూబుల నమూనాను కూడా దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. ఇదే ధర్మ పీఠం. కెరూబు దూతల ప్రతిమలు బంగారంతో చేయబడ్డాయి.

19 “యెహోవా నాకు సూచించిన మేరకు ఈ నమూనాలన్నీ వ్రాయబడ్డాయి. నమూనాలలో ప్రతి విషయాన్నీ నేను అర్థం చేసుకొనేలా యెహోవా నాకు సహాయపడ్డాడు” అని దావీదు చెప్పాడు.

20 దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నీవు ధైర్యంగా, నిలకడగా వుండు. పని మొదలు పెట్టు. నీవు భయపడవద్దు. ఎందు వల్లననగా నీ దేవుడైన యెహోవా నీతో వున్నాడు. పనంతా పూర్తయ్యే వరకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు యెహోవా ఆలయం నిర్మిస్తావు.

21 ఆలయ నిర్మాణ కార్యక్రమంలో యాజకులు, లేవీయులు తమ తమ విధులు నిర్వహించటానికి సిద్ధంగా వున్నారు. నైపుణ్యంగల పనివారంతా నీకు సహాయం చేయటానికి సిద్ధంగా వున్నారు. నీవు ఇచ్చే ప్రతి ఆజ్ఞ అధికారులు, ప్రజలు అంతా శిరసావహిస్తారు.”

29

1 అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: “దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు. అందువల్ల తాను చేయవలసిన పనులన్నిటిలో తగిన అనుభవం లేదు. కాని పని మాత్రం అతి ముఖ్యమైనది! ఈ భవనం ప్రజల కొరకు కాదు. ఇది యెహోవా దేవుని ఆలయం.

2 నా దేవుని ఆలయం కట్టించటానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నాశక్తి కొలదీ చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లు చేయటానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగటానికి సులిమాను రాళ్లు అనబడే మణులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పాల రాతిని కూడ నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తుసామగ్రిని లెక్కకు మించి ఇచ్చాను.

3 నా దేవుని ఆలయానికి వెండి బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించ దలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను.

4 ఆరువేల మణుగుల ఓఫీరు దేశపు బంగారాన్ని, పధ్నాలుగు వేల మణుగుల శుద్దమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండిరేకుల తొడుగు వేస్తారు.

5 వెండి బంగారాలతో చేయదగిన వస్తువులకు కావలసిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికివచ్చే అనేక రకాల వస్తు సామగ్రిని నిపుణతగల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆరోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వటానికి సిద్ధంగా వున్నారు?”

6 కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు.

7 ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా: పదివేల మణుగుల బంగారం, ఇరవై వేల మణుగుల వెండి, ముప్పదియారు వేల మణుగుల కంచు, రెండు లక్షల మణుగుల ఇనుము.

8 విలువైన రత్నాలు కలిగివున్న ప్రజలు వాటిని ఆలయానికి యిచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకొన్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు.

9 తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వటంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడ ఆనందంగా వున్నాడు.

10 సమావేశపర్చబడిన ప్రజానీకం ముందు దావీదు పిమ్మట యెహోవాకి స్తోత్రం చేశాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, మా తండ్రీ, సదా నీకు స్తోత్రం చేస్తాము.

11 గొప్పతనము, శక్తి, మహిమ, విజయము, గౌరవము అన్నీ నీకు చెందినవే ఎందుకంటే పరలోకమందు, భూమిమీద అన్నీ నీకు చెందినవే, ఓ దేవా, రాజ్యము నీదైయున్నది. నీవు సమస్త ప్రజలపై అధిపతివైయున్నావు.

12 భోగభాగ్యాలు, గౌరవం నీ నుండేవస్తాయి. సమస్తమును పాలించువాడవు నీవు. నీవు బల పరాక్రమసంపన్నుడవు. నీవు ఎవరినైనా గొప్ప వాడినిగా గాని, బలవంతునిగా గాని చేయగల సమర్థుడవు.

13 మా దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లించు చున్నాము. మహిమగల నీ నామమును స్తుతిస్తాము!

14 ఈ వస్తువులన్నీ నానుండి, నా ప్రజల నుండి రాలేదు. ఈ వస్తువులన్నీ నీనుండి వచ్చినవే. నీనుండి వచ్చిన వాటినే మేము తిరిగి నీకు సమర్పిస్తున్నాము.

15 మేము కొత్త వారిలా, బాటసారుల్లా వున్నాము. మా పూర్వీకులు కూడ పరాయివారిలా, బాట సారుల్లా వున్నారు. ఆశలేని మా బ్రతుకులు ఈ భూమి మీద నీడలాంటివి. ఎవ్వరూ స్థిరంగా వుండరు.

16 యెహోవా మా దేవా, నీ ఆలయ నిర్మాణానికై మేము ఈ వస్తువులన్నీ సమకూర్చాము. నీ నామము ఘనపర్చబడేలా మేము ఈ ఆలయం నిర్మిస్తాము. కాని ఈ వస్తుసంపదంతా నీ నుండి వచ్చినదే. ప్రతిదీ నీకు చెందినదే.

17 నా దేవా, నీవు ప్రజల హృదయాలను పరీక్షిస్తావని కూడ నాకు తెలుసు. ప్రజలు మంచి పనులు చేస్తే నీవు సంతోషిస్తావు. ఈ వస్తు సముదాయాన్నంతా హృదయ పూర్వకంగా (సదుద్దేశంతో) నేను ఇస్తున్నందుకు సంతోషిస్తున్నాను. నీ ప్రజలంతా అనేక కానుకలు సంతోషంగా నీకు ఇవ్వటానికి ఇక్కడ చేరియున్నట్లు నేను చూశాను.

18 ఓ దేవా, నీవు మా పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు దేవుడివి. నీ ప్రజలు సదా నిన్ను కొలిచేలా వారికి దయచేసి సహయపడుము. వారి హృదయాలెప్పుడూ నీ వైపు తిప్పుకోగలిగేలా వారికి నీవు సహాయపడుము.

19 నీ పట్ల సత్యవర్తనుడై మెలిగేలా నా కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయుము. నీ ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, నీ నియమ నిబంధనలను అతను ఎల్ల వేళలా పాటించేలా నీవతనికి తోడ్పడుము. ఈ విషయాలలో నీవు సొలొమోనుకు సహాయంచేసి, అతను నేను తలపెట్టిన ఆలయ నిర్మాణకార్యక్రమం పూర్తిచేసేలా తోడ్పడుము.”

20 పిమ్మట దావీదు అక్కడ చేరిన ప్రజాసమూహాన్ని ఉద్ధేశించి, “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాకు స్తోత్రం చేయండి” అని అన్నాడు. తమ పూర్వీకులు కొలిచిన దేవుడగు యెహోవాను ప్రజలంతా స్తుతించారు. యెహోవాకి రాజుకు గౌరవ సూచకంగా వారు సాష్టాంగ నమస్కారం చేశారు.

21 ఆ మరునాడు ప్రజలంతా యెహోవాకి బలులు అర్పించారు. యెహోవాకు వారు దహన బలులు అర్పించారు. వారు వేయి గిత్తలను, వేయి పొట్టేళ్లను, వేయి గొర్రె పిల్లలను బలి ఇచ్చారు. వారు పానార్పణలను కూడ సమర్పించారు. ఇశ్రాయేలు ప్రజలందరి తరపునా లెక్కలేనన్ని బలులు సమర్పించారు.

22 ఆ రోజు ప్రజలంతా బాగా తిని, తాగి ఆనందించారు. యెహోవా అక్కడ వారితో వున్నాడు. వారు చాలా ఆనందంగా వున్నారు. తరువాత దావీదు కుమారుడైన సొలొమోనును వారు రెండవసారి రాజుగా ప్రకటించారు. వారు సొలొమోనును రాజుగాను, సొదోకును యాజకునిగాను అభిషిక్తం చేశారు. యెహోవా నెలకొని వున్నచోటే వారు ఈ పనిచేశారు.

23 తరువాత సొలొమోను యెహోవా సింహాసనం మీద రాజు హోదాలో కూర్చున్నాడు. సొలొమోను తన తండ్రి స్థానాన్ని అలంకరించి వర్థిల్లాడు. ఇశ్రాయేలు ప్రజలంతా సొలొమోను ఆజ్ఞలను పాటించారు.

24 పెద్దలందరు, బలశాలురైన నాయకులు, రాజైన దావీదు కుమారులందరు సొలొమోనును రాజుగా గుర్తించి అతనికి విధేయులై వున్నారు.

25 యెహోవా సొలొమోనును చాలా గొప్ప వ్యక్తినిగా చేసాడు. యెహోవా సొలొమోనును చాలా ఉన్నతమైన వ్యక్తిగా చేస్తున్నాడని ఇశ్రాయేలు ప్రజలంతా గుర్తించారు. రాజుకు ఇవ్వవలసిన గౌరవాభిమానాలను యెహోవా సొలొమోనుకు ఇచ్చాడు. సొలొమోనుకు ముందు మరొక రాజెవ్వడూ అంతటి గౌరవాన్ని పొందియుండలేదు.

26 [This verse may not be a part of this translation]

27 [This verse may not be a part of this translation]

28 దావీదు బాగా వృద్ధుడయినాక మరణించాడు. దావీదు ఉత్తమ జీవితాన్ని దీర్ఘకాలం గడిపాడు. దావీదు అన్ని భోగభాగ్యాలు, గౌరవాభిమానాలు పొందాడు. తరువాత అతని కుమారుడు సొలొమోను నూతన రాజు అయ్యాడు.

29 రాజైన దావీదు ఆదినుండి అంతం వరకు చేసిన పనులన్నీ దీర్ఘదర్శియైన సమూయేలు వ్రాసిన వ్రాతలలోను, ప్రవక్తయగు నాతాను వ్రాతలలోను, దీర్ఘదర్శియైన గాదు వ్రాసిన వృత్తాంతాలలోను పొందుపర్చబడ్డాయి.

30 ఆ వ్రాతలన్నీ ఇశ్రాయేలుకు రాజుగా దావీదు చేసిన పనులన్నిటి గురించి తెల్పుతాయి. అవి దావీదు శౌర్యాన్ని గూర్చి, అతనికి సంభవించిన విషయాలను గూర్చి తెలియజేస్తాయి. ఆ వ్రాతలు ఇశ్రాయేలుకు, దాని పొరుగు రాజ్యాలన్నిటిలో జరిగిన కార్యాలు, వాటి పరిస్థితులను తెలియజేస్తాయి.